తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టపల్లి శివాలయంలోనికి పులిచింతల బ్యాక్ వాటర్ - heavy flood to suryapet district

మూడ్రోజులుగా కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లాకు భారీ వరద పోటెత్తింది. పులిచింతల బ్యాక్​ వాటర్​తో మట్టపల్లి శివాలయంలోనికి వరద నీరు చేరింది.

flood in mattampally lord shiva temple in suryapet
మట్టపల్లి శివాలయంలోనికి వరద నీరు

By

Published : Oct 16, 2020, 1:01 PM IST

భారీ వర్షాలతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు జలమయమయ్యాయి. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటం వల్ల పలు ప్రాంతాలు నీట మునిగాయి. పులిచింతల బ్యాక్​వాటర్​తో.. మట్టపల్లి గ్రామంలోని శివాలయంలోనికి వరద చేరింది.

ఎటుచూసిన నీటితో సూర్యాపేట జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు చేరి పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో చేరిన వరదల వల్ల జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు స్పందించి.. త్వరగా వరద నీటిని మళ్లించే ప్రయత్నం చేయాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న కొన్ని ప్రాంతాల ప్రజలు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details