వారం రోజులు కురిసిన వర్షాలకు పలు ప్రాజెక్టుల్లోకి వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 170 అడుగులకు నీరు చేరింది. విద్యుత్ ఉత్పాదనకై 15,000 క్యూసెక్కుల నీటిని అధికారులు నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 40 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి - flood hits Pulichinthala Project in suryapet district
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టమైన 175 అడుగుల్లో ప్రస్తుతం 170 అడుగుల మేర నీరు చేరింది.
![పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి flood hits Pulichinthala Project in chinthalapalem mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8527896-480-8527896-1598184754754.jpg)
పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి
పులిచింతల ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా కృష్ణానదిలోకి 3 లక్షల 11 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3, 30,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.