సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖాత్ గూడెంలో మంగళవారం రాత్రి ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మొలుగూరి సందీప్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు ముగించుని ఇంటికి వచ్చి చూసి మందలించగా.. బాలిక జరిగిన ఘోరాన్ని వివరించింది. బాధితురాలిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాఠశాల విద్యార్థులు నిందితుడికి ఉరిశిక్ష విధించాలంటూ.. ర్యాలీ తీశారు. మొలుగూరి సందీప్‌ను ఉరి తీయాలని గ్రామస్థులు బంద్ చేపట్టారు. గతంలో కూడా సందీప్ 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడానికి యత్నించాడని స్థానికులు చెబుతున్నారు.
ఐదేళ్ల బాలికపై అత్యాచారం - అత్యాచారం
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘోరం సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖాత్ గూడెంలో చోటుచేసుకుంది.
ఐదేళ్ల బాలికపై అత్యాచారం