సూర్యాపేట జిల్లాలో మరో 5 కరోనా కేసులు - coronavirus death toll in telangana
11:45 April 17
సూర్యాపేట జిల్లాలో మరో 5 కరోనా కేసులు
సూర్యాపేట జిల్లాలో నిన్న రికార్డు స్థాయిలో 16 కరోనా పాజిటివ్ నమోదు కాగా... ఈ రోజు మరో 5 కేసులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ బారిన పడ్డవారి సంఖ్య... 44కు చేరుకుంది. ఈ ఐదుగురు జిల్లా కేంద్రానికి చెందినవారే. సూర్యాపేట పట్టణంలోనే... 33 మంది వైరస్ బారిన పడ్డట్లయింది. ఇవాళ వెలుగుచూసిన కేసుల్లో... నలుగురు కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందినవారు కాగా... మరొకరు ఇందిరమ్మ కాలనీ వాసిగా అధికారులు గుర్తించారు.
అనుమానితుల నమూనాల్ని పరీక్షలకు పంపుతున్నారు. ఇంకా వంద మంది ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కొవిడ్ కేసులతో... జిల్లా కేంద్రంలో హై అలర్ట్ కొనసాగుతోంది. తిరుమలగిరికి సంబంధించి నిన్న బయటపడ్డ కేసులో... సదరు వ్యక్తితో ప్రాథమిక సంబంధాలు కలిగిన 26 మందిని క్వారంటైన్ తరలించారు. తిరుమలగిరిలో ఇది మూడో కేసు కావడంతో... మండల కేంద్రంలో హైపోక్లోరైడ్‌తో పిచికారి చేస్తున్నారు.