సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాథపురం గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మొదటి వార్షికోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ బిందు, ఎంఈఓ షరీఫ్ హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం - ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు సూర్యాపేట జిల్లా జగన్నాథపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విజన్ 150 అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
![ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం first anniversary Celebrations in a government school in suryapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6415124-479-6415124-1584252474198.jpg)
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు దేనికీ తీసిపోరని అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి 150 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించే విధంగా విజన్150 అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం
ఇవీచూడండి:దూలపల్లిలో కరోనా ఐసోలేషన్ సెంటర్..!