సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద కంటెయినర్‌ను ఓవర్టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజన్‌లోంచి మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. కారులో మంటలు వ్యాపించినందున రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నడిరోడ్డుపై కారు దగ్ధం..ముగ్గురికి తీవ్ర గాయాలు - కారు దగ్ధమై ముగ్గురికి తీవ్ర గాయాలు
కంటెయినర్‌ను ఓవర్టేక్ చేయబోతూ అదుపుతప్పి కారు బోల్తాపడిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జరిగింది. ఇంజన్‌లోంచి మంటలు చెలరేగి కారు కాలిపోయింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
కారు దగ్ధమై ముగ్గురికి తీవ్ర గాయాలు