తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట అమ్ముకునేందుకు రోడ్డెక్కిన రైతులు - farmers protest for no cotton purchacse

ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి, కందులు కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అధికారులు స్పందించి తమ పంట కొనుగోలు చేయాలని కోరారు.

farmers ratharoko in thirumalagiri
పంట అమ్ముకునేందుకు రోడ్డెక్కిన రైతులు

By

Published : Feb 18, 2020, 11:35 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పత్తి, కందులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నాలుగురోజుల క్రితం వ్యవసాయ మార్కెట్​లో ప్రారంభించిన ఐకేపీ కందుల కొనుగోలు కేంద్రంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వ్యాపారులు తీసుకొస్తే మాత్రం తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ... తొర్రూర్-వలిగొండ రహదారిపై రైతులు ధర్నా చేశారు. ఆరుగాలం కష్టపడి పండించి, విక్రయించేందుకు తీసుకొస్తే... దళారుల పత్తి కొంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మూడు రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నా... ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైన తమ పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పంట అమ్ముకునేందుకు రోడ్డెక్కిన రైతులు

ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ABOUT THE AUTHOR

...view details