తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగారం తహసీల్దార్​ శ్రీకాంత్​​ను సస్పెండ్​ చెయ్యండి: స్థానిక రైతులు

అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నాగారం తహసీల్దార్​ శ్రీకాంత్​ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్వో ఆఫీసు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. విచ్చలవిడిగా ఇసుకమాఫియాను ప్రోత్సహిస్తూ.. రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు.

farmers protest in front of nagaram mro office in suryapet district
నాగారం తహసీల్దార్​ శ్రీకాంత్​​ను సస్పెండ్​ చెయ్యండి: స్థానిక రైతులు

By

Published : Nov 2, 2020, 7:44 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండల తహసీల్దార్​ కార్యాలయం ఎదుట పేరబోయిన గూడెం, వర్ధమానుకోట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. బిక్కేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపునకు సహకరిస్తున్న నాగారం తహసీల్దార్​ శ్రీకాంత్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు.

మాజీ సైనికుడికి అన్యాయం..
పేరబోయిన గూడెం గ్రామానికి చెందిన ఇమ్మడి సోమయ్య అనే మాజీ సైనికుడి భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారని ఆ కుటుంబం రోడ్డెక్కి నిరసన తెలిపింది. తహసీల్దార్​కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే కాకుండా రైతులను బెదిరింపులకి గురిచేసి గ్రామంలోని 972 సర్వే నెంబర్లోని బాట భూమిని తీసేయడంతో పాటు హైకోర్టు ఉత్తర్వులను ఎమ్మార్వో శ్రీకాంత్​ ఉల్లంఘించారని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు అన్నపర్తి జ్ఞానసుందర్ ఆరోపించారు.

ఇసుక మాఫియాకు ప్రోత్సాహం..

ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ, అక్రమార్జనకు పాల్పడుతున్న తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పలుమార్లు దరఖాస్తు పెట్టినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా జిల్లాపాలనాధికారి స్పందించి నాగారం తహసీల్దార్ శ్రీకాంత్​ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'

ABOUT THE AUTHOR

...view details