సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు బస్తాలు ఇవ్వడం లేదని మిర్యాలగూడ-కోదాడ రహదారిపై బైఠాయించారు. అన్నదాతల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగైదు రోజుల నుంచి బస్తాల కోసం తిరుగుతున్నా... పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం నిల్వకోసం బస్తాలు ఇవ్వడం లేదని రైతుల రాస్తారోకో - suryapet district news
ధాన్యం నిల్వ చేసుకునేందుకు బస్తాలు ఇవ్వడం లేదని సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో రైతులు ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడ-కోదాడ రహదారిపై బైఠాయించారు.
ధాన్యం నిల్వకోసం బస్తాలు ఇవ్వడం లేదని రైతుల రాస్తారోకో
మిల్లులకు తీసుకెళ్తే ధాన్యం కొనడం లేదని.. వ్యాపారులు అంతా కుమ్మక్కై వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ కొన్నా... క్వింటాకు రెండు కిలోల కోత పెడుతున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఇంద్రకరణ్