ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూడు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడం ఎంతవరకు న్యాయమంటూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిపి వేయడంతో ఆగ్రహించిన అన్నదాతలు తిరుమలగిరి - మోత్కూరు రోడ్డుపై గంటపాటు ధర్నా నిర్వహించారు.
తిరుమలగిరిలో రైతుల ధర్నా... స్తంభించిన ట్రాఫిక్ - సూర్యాపేట జిల్లా వార్తలు
పత్తి కొనుగోళ్లను మూడు రోజుల పాటు నిలిపివేయడంతో తిరుమలగిరిలో రైతులు ధర్నాకి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా కొనుగోళ్లు నిలిపివేయడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. తిరుమలగిరి - మోత్కూరు రోడ్డుపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.
తిరుమలగిరిలో రైతుల ధర్నా... స్తంభించిన ట్రాఫిక్
రోడ్డుపై కిలోమీటరు మేర వాహనాలు నిలచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్ కార్యదర్శి శంశేర్ వచ్చి... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ విషయమై పత్తి కొనుగోలు అధికారులను వివరణ కోరగా... ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మిల్లులో స్థలం లేకపోవడంతో నిలిపివేసినట్లు తెలిపారు.