సూర్యాపేట జిల్లాలో రైతులు(farmers protest in kodhada) రోడ్డెక్కారు. వరిధాన్యం కొనుగోళ్లు చేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. కోదాడ పురపాలిక పరిధిలోని తమ్మర ఐకేపీ కేంద్రం జాతీయ రహదారిపై బైఠాయించి(farmers protest on national highway) నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జాతీయ రహదారిపై రైతుల ఆందోళన కనీస వసతుల్లేవు..
ఐకేపీ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో(farmers protest at IKP center) రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం తేమ లేదంటూ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆరోపించారు. వర్షం వస్తే తమ ధాన్యంపై కప్పుకునేందుకు కనీసం పట్టాలు కూడా లేవని వాపోయారు. ధాన్యం తడిస్తే కొనేదేవరని నిర్వాహకులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరుతో రోడ్డుపై బైఠాయించి(farmers protest atTammera) ధర్నా చేపట్టారు. కాసులకు కక్కుర్తి పడి మిల్లర్లు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటన్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు జరపకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. అనంతరం స్థానిక ఎస్సై సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పండిన ప్రతిగింజను కొంటామని చెప్పింది. క్షేత్రస్థాయిలో చూస్తే కొనుగోళ్లు కేంద్రాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఈ విషయంలో జిల్లా అధికారులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానం చెబుతున్నారు. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు కనీసం 10 పట్టాలు కూడా ఇవ్వడం లేదు. రైతులు ఈ విధంగా గోస పడుతుంటే సొంతంగా ఏర్పాటు చేసుకున్న కల్లాల్లో ఆరబోసుకుంటే పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రానికి వస్తేనే గోదాలు ఇస్తామని చెబుతున్నారు. గోనె సంచులు ఇవ్వమని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఇవాళ రైతులు తమ బాధను చెప్పుకునేందుకే రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. -కనగాల నారాయణ, రైతు
ఇదీ చూడండి: