సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి వద్ద రైతుల ధర్నా కొనసాగుతోంది. మిర్యాలగూడలో ధాన్యము కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. రెండు రోజుల వరకు కొనుగోలు చేయబోమని రైస్ మిల్లర్లు ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చేపట్టారు.
చిల్లెపల్లి వద్ద కొనసాగుతున్న ధర్నా... వాహనాలు దారి మళ్లింపు - సూర్యాపేట జిల్లా వార్తలు
రెండు రోజుల పాటు ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని రైస్ మిల్లర్లు ప్రకటించడంతో సూర్యాపేట జిల్లా చిల్లెపల్లి వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారీగా నిలిచిపోయిన వాహనాలను నేరేడుచర్ల నుంచి దారి మళ్లించారు.
చిల్లేపల్లి వద్ద కొనసాగుతున్న ధర్నా
ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ వైపు వెళ్తూ నిలిచిపోయిన వాహనాలను నేరేడుచర్ల నుంచి పోలీసులు దారి మళ్లించారు.
ఇదీ చదవండి:ఇకనైనా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవొద్దు: భాజపా