ధాన్యం కోతలు పూర్తై రెండునెలలైనా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐదురోజుల క్రితం మిల్లుకు ధాన్యం తీసుకొచ్చినా ఇంకా దిగుమతి కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ఐకేపీ కేంద్రం నుంచి సుమారు 20 మంది రైతులు తిరుమలగిరిలోని మిల్లుకు ధాన్యం తీసుకొచ్చినట్లు తెలిపారు. సకాలంలో ధాన్యం దిగుమతి చేయకపోగా క్వింటాకు 7 కిలోల చొప్పున కోత విధిస్తామని అంటున్నారని వాపోయారు.
రైతులకు తప్పని తిప్పలు.. ఓ వైపు ఆలస్యం మరోవైపు తరుగు - సూర్యాపేట లేటెస్ట్ అప్డేట్స్
వర్షాకాలం ప్రారంభమైనా యాసంగి పంట కొనుగోళ్లు పూర్తి కాలేదని రైతులు వాపోతున్నారు. మిల్లుకు తరలించిన ధాన్యాన్ని ఐదు రోజులైనా దిగుమతి చేయకపోగా... క్వింటాకు 7 కిలోల చొప్పున కోత విధిస్తామని అంటున్నారని వాపోయారు. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు
మరో పంటకాలం వచ్చినా కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు ఆలస్యమవుతోందని వాపోయారు. ధాన్యం దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండి:ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు