Attack on farmers: సూర్యాపేట జిల్లాలో కొందరు గుర్తు తెలియని దుండగులు రైతులపై దాడి చేస్తూ రెచ్చిపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం బానోతు బాలు, మున్నా అనే ఇద్దరు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని చెరో ట్రాక్టర్‌పై వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తులు సైడ్ ఎందుకు ఇవ్వలేదని ఇరువురితో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సైడ్ ఇవ్వలేదని రైతులపై దాడి.. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు - గొడవ
Attack on farmers: తమ ద్విచక్ర వాహనానికి సైడ్ ఇవ్వలేదని ట్రాక్టర్ డ్రైవర్లను కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. దాడికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Attack on farmers
కాసేపటి తరువాత ఇద్దరు రైతులు నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపేందుకు రాగా.. వారినే ఫాలో అవుతూ వచ్చిన నిందితులు రైతులను తీవ్ర దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిందితులు వచ్చిన బైక్ ఖమ్మంలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై రైతులు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
- పోడు గొడవ... అటవీ అధికారిపై కత్తితో దాడి
- ప్రాణం తీసిన బైక్ విన్యాసం.. 15 రోజులు మృత్యువుతో పోరాడి మృతి
- ‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో మరో ఆరుగురు నిందితుల అరెస్ట్