సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయిన గూడెం గ్రామానికి చెందిన వెంకన్న తన భూమికి పట్టా చేయాలని... కుటుంబంతో సహా తహసీల్దార్ కార్యాలయం ముందు కుర్చొని నిరసన తెలిపాడు. ఆరు సంవత్సరాలుగా పట్టా కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు.
అన్నదమ్ములు తనను మోసం చేసి అక్రమంగా పట్టా చేయించుకున్నారని... పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తెలిపాడు. పట్టా చేయకపోతే కుటంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. ఇకనైనా అధికారులు స్పందించి పట్టా చేయాలని కోరుతున్నాడు.