సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందారు. అర్వపల్లి గ్రామానికి చెందిన రైతు బైరబోయిన సంజీవ(52).. తనకున్న వ్యవసాయ భూమిలో వరాలు తీసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పొలంలో నీరు తక్కువగా ఉండడంతో మోటార్ స్టార్టర్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లినట్లు మృతుని కుమారుడు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - suryapet district latest news
విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మోటార్ స్టార్టర్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు.

DEAD
ఆ క్రమంలో కరెంటు సరఫరా అవడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి అప్పటికే తన తండ్రి మృతి చెందారని వాపోయాడు. మృతునికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'స్మార్ట్‌సిటీ నిధులను సక్రమంగా వినియోగించడం లేదు'