సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోనికి చెందిన వెంకన్న(55) తిరుమలగిరి వ్యవసాయమార్కెట్కు ధాన్యం తీసుకెళ్తున్నాడు. గతుకుల రోడ్డు కావటం వల్ల ట్రాక్టరులో ధాన్యం బస్తాల మీద కూర్చున్న వెంకన్న జారి పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకన్నను సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ధాన్యం తరలిస్తున్న రైతు జారిపడి మృతి - ధాన్యం తరలిస్తున్న రైతు జారిపడి మృతి...
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయ కేంద్రానికి తరలిస్తున్న రైతును గతుకుల రోడ్డు బలితీసుకుంది. ట్రాక్టర్లో ధాన్యం బస్తాలు తీసుకెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు.

FARMER DIED IN ACCIDENT AT RAVULAPALLY