తెలంగాణ

telangana

ETV Bharat / state

Extra Marital Affair Murders In Suryapet : 'ఇంత దారుణమా.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని.. కట్టుకున్నవాళ్లను మట్టుబెట్టేశారు'

Extra Marital Affair Murders In Suryapet : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఆ మోజులో పడి ఎంతోమంది తమ పండంటి కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా సూర్యాపేట జిల్లాలో వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది.

Extra Marital Affair Murder Mystery in Suryapet
Extra Marital Affair Murders In Suryapet

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 2:14 PM IST

Extra Marital Affair Murders In Suryapet : సూర్యాపేట జిల్లాలో వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. భర్త తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించాడు. మరో మూడు నెలల్లోనే ప్రియురాలి భర్తను చంపి బలవన్మరణంగా నమ్మించబోయాడు. సూర్యాపేట జిల్లాలో బయటపడిన ఈ హత్యల వివరాలను ఎస్పీ రాహుల్‌హెగ్డే శుక్రవారం వెల్లడించారు.

Wife Killed Husband Using Snake : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. ఊపిరాడకుండ చేసి.. ఆపై పాముకాటుతో హత్య చేయించిన భార్య

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..మోతె మండలం బళ్లు తండాకు చెందిన భూక్యా వెంకన్న తన కుటుంబంతో సూర్యాపేట భాగ్యనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. నూతనకల్‌ మండలం ఎర్రపహాడ్‌ గ్రామానికి చెందిన షేక్‌ రఫీ తన భార్య నస్రీన్‌తో కలిసి పట్టణంలోని శ్రీరాంనగర్‌లో నివసించేవారు. వెంకన్నకు, నస్రీన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడగా.. వాళ్లకు అడ్డుగా ఉన్నారని ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను చంపాలనుకున్నారు. పథకం ప్రకారం వెంకన్న ఈ ఏడాది జూన్‌ 8న రాత్రి సమయంలో భార్య రమాదేవితో కలిసి బళ్లు తండా నుంచి సూర్యాపేటకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గ మధ్యలో వాహనాన్ని నిలిపి భార్యను విద్యుత్తు స్తంభానికి కొట్టి హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందినట్లు అందరినీ నమ్మించాడు.

A Person Extramarital Affair with Sister in Law : అన్న భార్యతో వివాహేతర సంబంధం.. కానీ ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్

Extra Marital Affair Murder Mystery inSuryapet : రమాదేవిని చంపిన మూడు నెలల వ్యవధిలో.. భర్త రఫీని హత్య చేసేందుకు నస్రీన్‌ వెంకన్నతో కలిసి పథకం పన్నింది. ఈ నెల 9వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో రఫీ బయటకు వెళ్లడంతో.. నస్రీన్‌ మొబైల్ ద్వారా వెంకన్నకు సమాచారమిచ్చింది. వెంకన్న తన స్నేహితుడైనమోతె మండలం సిరికొండకు చెందిన అక్కెనపల్లి శ్రీశైలం, నామారం గ్రామానికి చెందిన సారగండ్ల మధుతో కలిసి రఫీ ఇంట్లోకెళ్లి దాక్కున్నారు. అరగంట సమయం తర్వాత ఇంటికి వచ్చిన రఫీని అందరూ కలిసి హత్య చేశారు. ఆ తర్వాత ఉరి వేసుకున్నాడని నమ్మించేందుకు రఫీ గొంతుకు చీరను బిగించి.. ఫ్యాన్‌కు వేలాడదీశారు.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రఫీకి ఎయిడ్స్‌ వచ్చిందని భార్య చెప్పడం, ఒంటిపై కొట్టిన గాయాలు ఉండటంతో అతడి సోదరుడు సుభాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నస్రీన్‌ మొబైల్ కాల్‌ డేటాను పరిశీలించడంతో అసలు విషయం బయట పడింది. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. ఈ రెండు హత్యల వల్ల వెంకన్న ఇద్దరు కుమార్తెలు, నస్రీన్‌ కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు. వీరంతా ఆరేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం. ఈ రెండు కేసులను ఛేదించిన సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌తోపాటు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

నా భర్తని చంపెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..

ABOUT THE AUTHOR

...view details