సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని మామిళ్ల మడువ గ్రామ పంచాయతీ ఆవాస గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్, బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ చేసిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసారు. ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. గతంలో కేసు నమోదైన ఐదుగురిని తహసీల్దార్ రామ్ ప్రసాద్ బైండోవర్ చేశారు. నాటు సారా తయారుచేసినా, అమ్మినా లక్ష రూపాయల జరిమానా.. జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని అమ్మకం దారులను హెచ్చరించారు.
నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు - police
సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ అధికారుల నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. మామిళ్లమడువ ఆవాస గ్రామాల్లో తనిఖీలు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.
నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు