హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరమని...తెరాస గెలిస్తే కుటుంబానికి లాభమని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ ఎన్నికలు ధన బలానికి... ప్రజాబలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. లోపల ఓడిపోతామనే భయం ఉన్నా.. తెరాస నేతలు పైకి మాత్రం గాంభీర్యంగా కనపడుతున్నారని చెప్పారు. విద్యార్థుల బలిదానాలపై వచ్చిన తెలంగాణ ఒకే ఒక్క కుటుంబం పాలయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న తెరాస నేతలను హుజూర్నగర్ తీసుకెళ్లి... ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని రాములు నాయక్ స్పష్టం చేశారు.
'హుజూర్‌నగర్‌లో ఓటర్లను ప్రలోభపెడితే సహించేది లేదు' - Ex MLC Ramulu naik said congress easly win in huzurnagar byelection
హుజూర్నగర్ ఉపఎన్నికలలో అధికార పార్టీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు.
Ex MLC Ramulu naik said congress easly win in huzurnagar byelection