గిరిజనులకు అసైన్డ్ భూములను సాగు చేసుకునే హక్కు ఉందని కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సర్వేనెంబర్ 540 భూ పోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. గుర్రంపోడు తండా రైతులు చేస్తున్న ఈ నిరసనలో గిరిజనులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
పదేళ్లు సాగు చేస్తే భూమిపై హక్కు ఉంటుంది..
అసైన్డ్ భూములను పది సంవత్సరాలు సాగు చేసుకుంటే వారికే భూమి మీద హక్కు ఉంటుందని తెలిపారు. అందుకు గతంలో కాంగ్రెస్ చట్టం చేసిందని గుర్తు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో గిరిజన భూములకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ఆ మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. గిరిజనులకు చెందిన 1870 ఎకరాలు అసైన్డ్ భూమిని రవీందర్ నాథ్ రెడ్డి అనే ఓ వ్యాపార వేత్త గిరిజనులను భయభ్రాంతులను గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ని ఆయన కోరారు.
ఇదీ చదవండి:నేనూ వ్యాక్సిన్ వేయించుకున్నా.. మీరూ తీసుకోండి: డీజీపీ