ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని నిజాయితీపరులను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ, పురపాలక శాఖ సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ఓటరు చైతన్య సదస్సుకు ఆయన హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు విధిగా ఓటేయాలన్నారు. ఓటు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని విద్యార్థులకు సూచించారు.