తెలంగాణ

telangana

ETV Bharat / state

ETELA RAJENDER: 'ధాన్యాన్ని సకాలంలో కొని రైతులకు డబ్బులు చెల్లించాలి' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

ETELA RAJENDER:ధాన్యం రైతుల ఇబ్బందులపై సీఎం కేసీఆర్ నీరో చక్రవర్తి పాత్రను వీడాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అన్నదాతలు అతి తక్కువ ధరలకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేయకుండా రైతుల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్.. వేసిన పంటలనైనా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

etela rajender
ఈటల రాజేందర్

By

Published : May 10, 2022, 5:40 PM IST

ETELA RAJENDER: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఉసురు తీసుకుంటున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి ఏమేమి మౌలిక వసతులు కావాలో వాటిని సమకూర్చాలని అన్నారు. ఖమ్మం జిల్లాకు వెళుతూ మార్గమధ్యలో సూర్యాపేటలోని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో సమావేశమయ్యారు.

రైతులకు 50 కిలోల బస్తాకు గాను మూడు, నాలుగు కిలోల ధాన్యం కోత విధించకుండా కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం ఎవరి మీద నెపం నెట్టినా... కేంద్రంపై నింద మోపి తను తప్పించుకునే ప్రయత్నం చేసినా... ప్రజాక్షేత్రంలో ఆయనకు శిక్ష వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

రాబోయే కాలంలో రైతుల ఆగ్రహానికి సీఎం కేసీఆర్ గురికాక తప్పదని అన్నారు. పోయే కాలం దాపురించింది కాబట్టే రైతుల కళ్లల్లో నీళ్లు చూస్తున్నారని ఆరోపించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతులు ఏడ్చినా రాజ్యం బాగుపడదని పదే పదే సీఎం చెప్పారు. అందుకే వారిని ఏడిపించే ప్రయత్నం చేయవద్దని ఈటల హితవు పలికారు.

ఇప్పటికే అకాల వర్షాలతో పండించిన పంట కల్లాల నుంచి కొట్టుకుపోయిందని ఈటల పేర్కొన్నారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించినప్పటికి వాటిని పాటించడం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరిక మేరకు కేంద్రం ఇంకో ఐదున్నర లక్షల క్వింటాళ్ల ఉప్పుడు బియ్యం సేకరించనుందని ఈటల రాజేందర్ తెలిపారు.

"ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల బస్తాలు సిద్ధం చేసుకోలేదు. గోదాంలను సిద్ధం చేయలేదు. దీని ఫలితంగా కావల్సినన్ని సెంటర్లను ఏర్పాటు చేయలేదు. పంటలు వేయకుండా రైతుల కళ్లల్లో మట్టికొట్టిన కేసీఆర్... వేసిన పంటలనైన కొనుగోలు చేయాలి. తక్షణమే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి ఏమేమి మౌలిక వసతులు కావాలో వాటిని సమకూర్చాలి. ధాన్యాన్ని సకాలంలో కొని రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం."-ఈటల రాజేందర్ భాజపా ఎమ్మెల్యే

ధాన్యాన్ని సకాలంలో కొని రైతులకు డబ్బులు చెల్లించాలి

ఇదీ చదవండి:నానమ్మ ఊర్లో మంత్రి కేటీఆర్​ సందడి.. పూర్వీకుల ఇంటి పరిశీలన..

'దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదు?'

ABOUT THE AUTHOR

...view details