సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జిల్లా ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు ప్రియాగోల్డ్ సహకారంతో కరోనా బారిన పడిన పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. దాదాపు వంద మందికి రెండు వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ సేవాబావాన్ని పెంపొందిచుకోవాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యిమ్మడి సోమనర్సయ్య అన్నారు.
కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ - groveries distribution in thirumalagiri
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కరోనా బారిన పడిన దాదాపు వంద కుటుంబాలకు రెండు వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను అందజేశారు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు.
కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
ప్రజలందరూ సంయమనంతో ఇళ్లల్లో ఉండి కరోనా నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ.. తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సామ అంజనేయులు, ఎస్సై పి.లోకేశ్, బిచ్చునాయక్, గజ్జి ఉపేందర్, దారం ఉపేందర్, రాపాక సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్