తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో కరోనా ఉద్ధృతి.. ఇవాళ 41 కేసులు.. - నల్గొండ జిల్లా కరోనా వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 41 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వాటిలో నల్గొండలో 24, సూర్యాపేటలో 11, యాదాద్రిలో 6 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి.

covid cases in nalgonda
ఉమ్మడి నల్గొండలో కరోనా ఉద్ధృతి

By

Published : Jul 10, 2020, 9:23 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 41 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. కొవిడ్​తో శుక్రవారం ఒకరు మృతి చెందగా... మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసుల్లో నల్గొండలో 24 కేసులు నమోదయ్యాయి. వాటిలో మిర్యాలగూడలో 8, నల్గొండ జిల్లా కేంద్రంలో 7, హాలియాలో 3, నిడమనూరులో 2, దేవరకొండ, గుడిపల్లి, శాలిగౌరారం, మునుగోడులో ఒక్కో కేసు చొప్పున బయటపడ్డాయి. మహమ్మారితో మరొకరు ప్రాణాలు కోల్పోగా... 143 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో 11 కేసులకు గాను... కోదాడలో 4, జిల్లా కేంద్రంలో 3, మఠంపల్లి, మునగాల, నాగారం, నేరేడుచర్ల మండలాలకు చెందిన ఒక్కో వ్యక్తి... వైరస్ బారిన పడ్డారు. యాదాద్రి జిల్లాలోని ఆరు కేసుల్లో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో రెండు చొప్పున... బీబీనగర్, ఆలేరు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్ధరణ అయ్యాయి.

ఇవీ చూడండి:వాస్తు పేరుతో ప్రజాధనం వృథా : రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details