తెలంగాణ

telangana

ETV Bharat / state

విషపు వలలో 'గిరి జనం'

ఆ గ్రామంలో నివాసం ఉండేది అంతా గిరిజనులే.  అందరికీ విష జ్వరాలు రావటంతో ఒక్కసారిగా ఆ పల్లెంతా విషాదం అలుముకుంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు సరైన వైద్యం అందించడం లేదని బాధితులు వాపోయారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.

By

Published : Mar 2, 2019, 8:44 AM IST

విష జ్వరాలతో ఊరంతా మంచం బాట పట్టారు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం తునికినూతల గ్రామంలో నివాసం ఉండేది కేవలం గిరిజనులే. గ్రామంలో విష జ్వరాలు వ్యాపించి చిన్న, పెద్దఅందరూ మంచం పట్టారు. గ్రామంలో దాదాపు 200 నివాసాలు ఉన్నాయి. అక్కడ ఉన్నవారందరికీ విష జ్వరాలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.జ్వరం వచ్చిన వారిని పరీక్షించి ఒక సెలైన్ బాటిల్ పెట్టి మాత్రలు మాత్రమే ఇస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. విషజ్వరాలు నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు తగ్గి మళ్లీ వస్తున్నాయని వీటి బారి నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు.గ్రామంలో మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవటం వల్ల వీధుల నిండా మురుగు నీరు ప్రవహించి దోమలు, ఈగలతో విష జ్వరాలు వ్యాపించాయని స్థానికులుపేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details