అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో కోతలు విధించారన్న ఆరోపణలతో ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ అధికారి నాగమణిపై విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో రాష్ట్ర శాఖ జాయింట్ డైరెక్టర్ సునందతో పాటు అధికారులు ఆరా తీశారు.
సూర్యాపేట జిల్లాలో ఐసీడీఎస్ అధికారిపై విచారణ - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ అధికారి నాగమణిపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. రాష్ట్ర శాఖ జాయింట్ డైరెక్టర్ సునంద ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు.
సూర్యాపేట జిల్లాలో ఐసీడీఎస్ అధికారిపై విచారణ
తుంగతుర్తి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు తమ వేతనాల్లో కోతలు విధించారని అధికారులకు తెలియజేశారు. వాస్తవాలను గుర్తించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ సభ్యులను కోరారు.