తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏరువాక పున్నమిలో దుక్కి దున్నిన మంత్రి జగదీశ్​రెడ్డి

జలాలు సమృద్ధిగా అందుతుండటం వల్ల సూర్యాపేట జిల్లాలో రైతులు సంతోషంగా ఏరువాకకు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్​) మండల కేంద్రంలో సుమారు 150 నాగళ్లతో రైతులు భారీగా తరలివచ్చారు. రైతులతో కలిసి స్వయంగా మాట్లాడిన జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అరక దున్ని ఏరువాకను ప్రారంభించారు.

ఏరువాక పున్నమిలో దుక్కి దున్నిన మంత్రి జగదీశ్
ఏరువాక పున్నమిలో దుక్కి దున్నిన మంత్రి జగదీశ్

By

Published : Jun 5, 2020, 10:50 PM IST

సూర్యాపేట జిల్లాలో పౌర్ణమి రోజున రైతులతో కలిసి వ్యవసాయ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ ప్రారంభించారు. బీళ్లుగా మారిన పొలాలకు.. నేడు కాళేశ్వరం ప్రాజెక్టుతో సమృద్ధిగా సాగు నీరు దొరుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు కలిసి వ్యవసాయ పనులను ప్రారంభించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏరువాక పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకున్నారు.

రైతుల మద్దతు నియంత్రిత సాగుకే..

జిల్లాలోని ఆత్మకూరు (ఎస్​) మండల కేంద్రంలో రైతులు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్​ రెడ్డి రైతులతో కలిసి 'గో' పూజ చేశారు. అనంతరం అరక దున్ని వ్యవసాయ పనులను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని.. అలాంటి వారు నేడు సాగు నీటి ప్రాజెక్టులపై దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నియంత్రిత సాగు విధానంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని... రైతులు సంపూర్ణ మద్దతు తెలిపారని మంత్రి వెల్లడించారు.

ఏరువాక పున్నమిలో దుక్కి దున్నిన మంత్రి జగదీశ్

ఇవీ చూడండి : 'నేతన్నలకు సాయం చేసే ఆలోచనేమైనా ఉందా?'

ABOUT THE AUTHOR

...view details