తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్​లో హోరెత్తనున్న ప్రచార జోరు - హుజూర్​నగర్​లో ప్రచార జోరు

పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలడం వల్ల... ఇక హుజూర్​నగర్​ ఉపఎన్నిక ప్రచారం హోరెత్తనుంది. ఇప్పటివరకు పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలకే పరిమితమైన ప్రచార పర్వం... ఇప్పుడు రాష్ట్రస్థాయి నాయకుల రాకతో ఊపందుకోబోతోంది. ముఖ్య కార్యకర్తలు, క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల వరకే సాగిన వ్యూహాలు... ఇక ఓటరు వద్దకు చేరుకోబోతున్నాయి. ప్రధాన పార్టీల తరఫున నేడు కేటీఆర్, కోదండరాం సెగ్మెంట్లో పర్యటించనున్నారు.

హుజూర్​నగర్​లో ప్రచార జోరు

By

Published : Oct 4, 2019, 8:21 AM IST

Updated : Oct 4, 2019, 10:45 AM IST

హుజూర్​నగర్​లో హుజూర్​నగర్​లో
ఎంతమంది బరిలో ఉంటారు... ఎవరు మనకు పోటీ... అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన ప్రధాన పార్టీలు... ఇపుడు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ఇల్లిల్లూ తిరిగి ఓట్లు అభ్యర్థించే పనిలో పడ్డాయి. తెరాస, కాంగ్రెస్, భాజపాతోపాటు చిన్న పార్టీలు సైతం... ప్రచారాన్ని హోరెత్తించబోతున్నాయి. బాగా ఓట్లు పడతాయన్న నమ్మకంతో... అన్ని వర్గాలను కలుసుకోవాలన్న తపన అభ్యర్థుల్లో కనపడుతోంది. అభ్యర్థులు, స్థానిక నాయకులే కాకుండా... అధిష్ఠానం పెద్దలను కూడా ప్రచారానికి రప్పించే వ్యూహాలు సిద్ధం చేశాయి. ఇందులో కాంగ్రెస్, తెరాస ముందు వరుసలో నిలుస్తున్నాయి.

కేటీఆర్​ రోడ్​షో

ఇప్పటికే సభ ఏర్పాటు చేసి అగ్ర నేతలందర్నీ రప్పించిన హస్తం పార్టీ... ఇక ముందు కూడా కీలక నేతల్ని రంగంలోకి దించబోతోంది. తెరాస నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్​ షో అనంతరం పార్టీ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. పార్టీ బలాలు, బలహీనతలపై దృష్టి సారించిన మండల ఇంఛార్జిలు సెగ్మెంట్​లోని పరిస్థితులపై అవగాహనతో ముఖ్య నేతల్ని రంగంలోకి దించాలని తెరాస భావించింది. అందులో భాగంగానే కేటీఆర్​ ఉపఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు.

హస్తం నేతల ఐక్యతారాగం

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సైతం... ఇవాళ హుజూర్​నగర్​లో పర్యటించనున్నారు. కాంగ్రెస్​కు మద్దతు తెలిపిన కోదండరామ్... ఉత్తమ్​తో సమావేశం కానున్నారు. గత పది రోజుల నుంచి ఒంటరి పర్యటనలతో ప్రచారం చేపడుతున్న ఉత్తమ్... ఇక పార్టీ ముఖ్య నేతల్ని రంగంలోకి దించబోతున్నారు. అంటీముట్టనట్లుగా వ్యవహరించే నేతలంతా ఐక్యతారాగం వినిపిస్తుండటం వల్ల నియోజకవర్గంలోని హస్తం శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.

భాజపా భేరి

భాజపా అభ్యర్థి కోటా రామారావు సైతం... విస్తృత రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. నామపత్రాలు దాఖలు చేసిన రోజు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్​తో కలిసి ప్రచారం చేసిన రామారావు... ఇప్పుడు పల్లెల బాట పడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలు, ఎంపీలకు మండలాల బాధ్యతలు అప్పగించడంతో... భాజపా నేతలంతా నియోజకవర్గానికి చేరుకుంటున్నారు.

మేమేం తక్కువ కాదు

ఇలా ప్రధాన పార్టీలతో పాటు... తామేం తక్కువ కాదన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Last Updated : Oct 4, 2019, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details