సూర్యాపేట జిల్లాలో మునగాల, చిలుకూరు మండలాలలో రేపు జరగబోయే ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మునగాల మండలంను 5 ఎన్నికల రూట్స్గా, మూడు జోన్లుగా విభజించారు. మొత్తం 390 మంది ఎన్నికల సిబ్బంది, 30 మంది రిజర్వ్ సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించబోతున్నారు. మండలంలో మొత్తం నాలుగు సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు కాకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుపుతామని తెలిపారు. అలాగే చిలుకూరు మండలను 8 ఎన్నికల రూట్స్, రెండు జోన్లుగా విభజించారు. మొత్తం 100 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు: ఎస్పీ - Election Preparations in Suryapet district
సూర్యాపేట జిల్లా మునగాల, చిలుకూరు మండలాల్లో రేపు జరగబోయే ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు: ఎస్పీ