సూర్యాపేటలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ - ELECTION COUNTING
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పట్టణంలోని ఎస్వీ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో కౌంటింగ్జరుగుతోంది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం 14 మండలాలకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.