సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో పాత వెల్లటూర్ గ్రామ సమీపంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 10 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు సార్లు కంపించిందని అన్నారు.
సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూకంపం.. భయాందోళనలో జనం.. - Suryapet district Earthquake news today
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల భూకంపం సంభవించగా.. తాజాగా ఈరోజు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూర్ గ్రామ సమీపంలో పలుచోట్ల భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. 10 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు సార్లు కంపించిందని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూకంపం.. భయాందోళనలో జనం..
భూమి కంపించడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చింతలపాలెం మండల కేంద్రంలో సుమారు నెల రోజుల నుంచి వస్తున్న భూకంపానికి ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చినట్టు స్థానికులు వెల్లడించారు. సుమారు నాలుగు సెకన్లు కంపించిందన్నారు. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1 గా నమోదైందని సమాచారం.
ఇదీ చూడండి :స్టూడెంట్ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్