సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమి ఐదుసార్లు కంపించినట్లు తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై 2.1 గా నమోదైనట్లు వివరించారు. నాలుగు సెకన్ల పాటు భూమి కంపించిందని ఆయన వెల్లడించారు.
చింతలపాలెంలో భూకంపం.. ఆందోళనలో స్థానికులు... - చింతలపాలెంలో భూకంపం.. ఆందోళనలో ప్రజలు
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.1గా నమోదైంది. వరుసగా జరుగుతున్న ప్రకంపనలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

చింతలపాలెంలో భూకంపం.. ఆందోళనలో ప్రజలు
తెల్లవారుజామున మూడు నుంచి 5 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఫలితంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల జిల్లాలోని కృష్ణా పరివాహాక ప్రాంతంలో ప్రకంపనలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే ఎన్జీఆర్ఐ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి.. భూకంప లేఖని యంత్రం ఏర్పాటు చేశారు.