సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూమి మళ్లీ కంపించింది. ఇవాళ వరుసగా నాలుగు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు వినిపించడం లేదని వాపోతున్నారు.
చింతలపాలెంలో భూకంపం... భయాందోళనలో ప్రజలు - చింతలపాలెంలో భూకంపం
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో వరుసగా నాలుగు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.0 గా నమోదైందని తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. సుమారు నాలుగు సెకన్ల పాటు కంపించిందని పేర్కొన్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
earth quakes
రిక్టర్ స్కేలుపై 3.0 గా నమోదైందని.. సుమారు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించిందని తహసీల్దార్ కమలాకర్ తెలిపారు.
ఇదీ చూడండి:అమెజాన్లోనూ ఇక మద్యం హోం డెలివరీ!