తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు - భూ కంపం తాజా వాార్త

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సుమారు 7 సెకన్ల పాటు భారీ శబ్ధాలతో భూమి కంపించిందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

earth quake in suryapet district
సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు

By

Published : Feb 10, 2020, 8:53 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో భారీ శబ్ధంతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సుమారు 7 సెకన్లు పాటు భారీ శబ్ధాలతో భూమి కంపించడం వల్ల ఇళ్లలోని జనం భయభ్రాంతులకు గురయ్యారు.

పులిచింతల బ్యాక్ వాటర్ వల్ల భూ ప్రకంపనలు వస్తోన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ జరపకుండా ఆపాలంటూ వారు కోరుతున్నారు. జనవరి 26 తర్వాత మళ్లీ ఇలా భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. రిక్టర్​స్కేలుపై 3.5గా నమోదయ్యి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు

నిర్లక్ష్యమేల: తుపాకులు మాయమవుతున్నా.. పట్టింపేది?

ABOUT THE AUTHOR

...view details