తెలంగాణ

telangana

ఒంటరైన గురునాథం కుటుంబం

యజమానిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోగొట్టుకున్నారు డ్రైవర్​ గురునాథం. నాన్న లేడని అమాయకంగా చూస్తున్న కుమారుడిని, భర్త కోసం గుండెలావిసేలా ఏడుస్తున్న భార్యను ఒంటరి చేశాడు. వృద్ధప్యంలో తల్లిదండ్రులకు తీరని శోకన్ని మిగిల్చాడు. కుటుంబాన్ని ఒంటరి చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయరెడ్డిని రక్షించే ప్రయత్నంలో డ్రైవర్‌ గురునాథం గాయపడ్డారు. హైదరాబాద్​ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

By

Published : Nov 5, 2019, 7:38 PM IST

Published : Nov 5, 2019, 7:38 PM IST

ఒంటరైన గురునాథం కుటుంబం

ఒంటరైన గురునాథం కుటుంబం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్‌ విజయరెడ్డిని కాపాడే ప్రయత్నంలో గాయపడిన ఆమె డ్రైవర్​ గురునాథం మృతి చెందాడు. హైదరాబాద్​ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతను గత ఏడేళ్లుగా విజయరెడ్డి వద్ద పనిచేస్తున్నారు. గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా వెలిగొండ. భార్యతోపాటు ఏడాదిన్నర కుమారుడు ఉండగా... ప్రస్తుతం భార్య గర్భవతి.

కఠిన చర్యలు

ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే గురునాథం ఈ ఘటనలో మృతి చెందడం వల్ల అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతికి కారణమైన నిందితుడు సురేష్​పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో గురునాథం మృతదేహానికి హుజూర్‌నగర్‌ శాసనసభ్యుడు సైదిరెడ్డి నివాళులర్పించి అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఆర్థిక సహాయం

శవపరీక్ష పూర్తైన అనంతరం గురునాథం మృతదేహాన్ని కుటుంబసభ్యులు సూర్యాపేట జిల్లాలోని అతని స్వగ్రామానికి తరలించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు డ్రైవర్‌ గురునాథం కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయగా, ఎమ్మెల్యే సైదిరెడ్డి పది వేల రూపాయలు అందించారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

ABOUT THE AUTHOR

...view details