తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖానికి మాస్క్​తో ఆర్​ఎంపీ.. ఆసుపత్రి సీజ్ - కోదాడలో ప్రశాంతి ఆసుపత్రి సీజ్

వైద్యుడి స్థానంలో ఆర్​ఎంపీతో సేవలందిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్​ చేశారు. పక్కా సమాచారంతో తనిఖీ చేసిన అధికారులు చర్యలు తీసుకున్నారు.

district medical officers seize prashanthi hospital in kodada
ముఖానికి మాస్క్​తో ఆర్​ఎంపీ.. ఆసుపత్రి సీజ్

By

Published : May 28, 2020, 4:18 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రశాంతి ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి సీజ్​ చేశారు. ఓ ఆర్​ఎంపీ వైద్యుడు... రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో ఆసుపత్రిని తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారు. రికార్డులు పరిశీలించి వైద్యశాలను మూసివేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి నిరంజన్ తెలిపారు.

పట్టణంలోని హుజూర్​నగర్​ రోడ్​లో ఉన్న ప్రశాంతి మందుల దుకాణంలో కొంత కాలంగా ప్రతి మంగళవారం చర్మవ్యాధులకు వైద్యం చేసేవారు. రెండు నెలలుగా నిపుణుడు రావడం లేదు. మెడికల్ షాప్​ యజమాని సహకారంతో... స్థానిక ఆర్​ఎంపీ ముఖానికి మాస్క్​ కట్టుకొని రోగులను పరిశీలిస్తున్నాడు. సమాచారం అందుకున్న వైద్యాధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నారు.

ముఖానికి మాస్క్​తో ఆర్​ఎంపీ.. ఆసుపత్రి సీజ్

ఇవీ చూడండి:పత్తికి అదనంగా రూ.275 పెంచండి!

ABOUT THE AUTHOR

...view details