కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు, సూర్యాపేట జిల్లా దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను కోరారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.
'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - mp uttam kumar reddy latest updates
సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు, మిగిలి ఉన్న పనులపై సమీక్ష చేపట్టారు.
'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధికారులు వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు, మిగిలి ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని మినరల్ ఫండ్ ఖర్చు చేయడంలో ఏకపక్ష విధానాలను అవలంభిస్తున్నారని పేర్కొన్నారు.
ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'