తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలగిరిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ - undefined

తిరుమలగిరిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్​ కుమార్​ పంపిణీ చేశారు. 41 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు.

distribution-of-kalyanalakshmi-and-shadimubarak-checks-in-tirumalagiri
తిరుమలగిరిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

By

Published : Feb 2, 2020, 2:55 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మండల పరిషత్​ కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్​ కుమార్.. 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ పోతరాజు రజిని, ఎమ్మార్వో హరిచంద్ర ప్రసాద్​, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి రవీందర్​ పాల్గొన్నారు.

ప్రతి పేదింటి ఆడపిల్ల తమ తోబుట్టువేనని... ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ లాంటి పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. తెలంగాణలో ఉన్న 18సంవత్సరాలు పూర్తైన ప్రతి ఆడపడచు పెళ్లికి ఈ పథకం వర్తిస్తోందని కులాలు, మతాలతో సంబంధం లేకుండా అందరూ వినియోగించుకోవాలని కోరారు.

తిరుమలగిరిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details