తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపిణీ - HYDROXY CHLOROQUINE

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల పరిధిలోని ప్రజలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కువ భాగం బయటే ఉంటున్నందున వారికి సైతం మాత్రలు అందించినట్లు వైద్యుడు వెల్లడించారు.

పోలీసులకు,స్థానికులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపిణీ
పోలీసులకు,స్థానికులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపిణీ

By

Published : Apr 28, 2020, 12:05 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో కరోనా కట్టడికి సంబంధించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. జిల్లాలోని క్వారంటైన్ నుంచి వచ్చి ఇళ్లలో ఉంటున్న 74 మందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ ప్రశాంత్ బాబు మాత్రలను ప్రజలకు అందించారు. 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ఆరోగ్య సిబ్బంది ఎక్కువ భాగం బయటే ఉంటూ ఎవరెవరినో కలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు మాత్రలను అందజేసినట్లు వైద్యుడు ప్రశాంత్ తెలిపారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చు నాయక్, రామచంద్రు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details