రోజులు గడుస్తున్నా అన్నదాతలకు ధాన్యం అమ్మకాల కష్టాలు తీరడం లేదు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో వ్యవసాయ మార్కెట్ల దగ్గర రైతులు నిరసనలు చేపట్టారు. తిండీతిప్పలు లేకుండా టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నా... తెలిసిన వారికే అధికారులు టోకెన్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని.. అమ్మేటప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. నూతనకల్ మండలం చిల్పకుంట్లలో రైతులు ఆందోళన చేపట్టారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోనూ వరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు.. ధాన్యం విక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ... పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసుకున్నారు. జిల్లాలో 351 కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుపెట్టకపోవడంతో... కేంద్రాలు ధాన్యంతో నిండిపోయాయి.
ధాన్యం కుప్ప వద్దే రైతు ఆత్మహత్య..