సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, నల్గొండ ఎంపీ, దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజారాణి పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి, విద్యుత్, మున్సిపాలిటీ, వ్యవసాయ, ఉద్యానవన, వైద్యశాఖ, మహిళా శిశు సంక్షేమ, సివిల్ సప్లై, రెవెన్యూ, జిల్లా పరిశ్రమల శాఖపై సమీక్షించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో 2, 69, 508 కుటుంబాలకు జాబ్ కార్డులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.