కార్తికమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలోని ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేకపూజలు చేసి, దీపాలు వెలిగించారు. ఉదయాన్నే స్వామివారిపై సూర్యకిరణాలు పడటం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంటుందని భక్తులు తెలిపారు.
'స్వామివారిపై సూర్యకిరణాలు పడటం బూరుగడ్డ ప్రత్యేకత' - సూర్యాపేట జిల్లా తాజా సమాచారం
కార్తికమాసం వచ్చిందంటే చాలు శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. వేకువజామునే స్నానమాచరించి దీపాలు వెలిగించడం ఈ మాసం ప్రత్యేకత. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో ఉన్న దేవస్థానంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విశేష పూజలు చేశారు.
'స్వామివారిపై సూర్యకిరణాలు పడటం బూరుగడ్డ ఆలయ ప్రత్యేకత'
ప్రతి ఏటా నాలుగో సోమవారం నాడు శ్రీ శ్రీ శ్రీ నల్లకట్ట సంతాన కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామివారి కల్యాణం జరుగుతుందన్నారు. ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తికమాసంలో నిత్యపూజలతోపాటు శివునికి రుద్రాభిషేకం జరుగుతుందని భక్తులు వెల్లడించారు.