తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్స్యకారుడి వలలో డెవిల్​ చేపలు

చేప పిల్లలను ఎదగనివ్వకుండా తినేసే డెవిల్​ ఫిష్​లు సూర్యాపేట జిల్లా అనాజిపురం చెరువులో చిక్కాయి. డెవిల్​ ఫిష్​లను చూసి.. చేపల పెంపకం పెను ప్రమాదంలో పడిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

devil fishes at anajipuram in suryapet district
అనాజిపురం చెరువులో డెవిల్ ఫిష్​లు

By

Published : Dec 17, 2019, 9:06 AM IST

అనాజిపురం చెరువులో డెవిల్ ఫిష్​లు

సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్ మండలం అనాజిపురం చెరువులో రెండు డెవిల్ ఫిష్​లు మత్స్యకారుల వలకు చిక్కాయి. ఈ ప్రాంతంలో అరుదుగా కనిపించే డెవిల్ ఫిష్​లు ఇటీవల కాలంలో పలు చెరువుల్లో తరచుగా వలలకు చిక్కుతున్నాయి.

ఎస్సారెస్పీ నుంచి వచ్చే గోదావరి జలాల్లో ఈ చేపలు ఎక్కువగా వస్తున్నట్లు మత్స్యకారులు గుర్తించారు. కానీ.... మూసీ పరివాహక ప్రాంతమైన అనాజిపురం చెరువులోనూ డెవిల్ ఫిష్ దొరకడం మత్స్యకారులకు ఆందోళన కలిగిస్తోంది.

డెవిల్ ఫిష్​లు మిగిలిన చిన్న చేపలను ఎదగనివ్వకుండా తింటాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయా చెరువుల్లో చేపల పెంపకం కోసం వదిలిన చేప పిల్లల మనుగడ ప్రమాదంలో పడిందని మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details