తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపాలిటీల అభివృద్ధే తెరాస ధ్యేయం: ఎమ్మెల్యే సైదిరెడ్డి - sueyapeta updates

గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మున్సిపాలిటీల అభివృద్దికి తెరాస ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ సాధారణ సభ్య కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ధ్యేయం.. శానంపూడి సైదిరెడ్డి
మున్సిపాలిటీల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ధ్యేయం.. శానంపూడి సైదిరెడ్డి

By

Published : Jun 17, 2020, 10:49 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ సాధారణ సభ్య కౌన్సిల్ సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులలో మార్పు రావడం వలన సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మున్సిపాలిటీల అభివృద్దికి తెరాస ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జయబాబు, వైస్ చైర్మన్ చల్లా శ్రీలతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామిరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details