తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో 83కు చేరిన కరోనా కేసులు - corona virus suryapeta

సూర్యాపేటలో మొత్తం 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎస్​ సోమేశ్​ కుమార్​ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సూర్యాపేటలోని కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

cs somesh kumar review on corona in suryapeta district
సూర్యాపేటలో 83కు చేరిన కరోనా కేసులు

By

Published : Apr 22, 2020, 1:00 PM IST

సూర్యాపేటలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పర్యటించారు. సూర్యాపేటలో మొత్తం 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎస్​ వెల్లడించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి పెరగడానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. వైరస్​ నియంత్రణ చర్యల కోసం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించామన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌లో ప్రజల కదలికలను లేకుండా చూడాలని చెప్పామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details