సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో పెద్దగట్టు జాతర లింగమంతుల స్వామిని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, దేవాదాయ అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. లింగమంతుల స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
పెద్దగట్టు జాతరలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి - తెలంగాణ వార్తలు
ప్రఖ్యాతిగాంచిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో పెద్దగట్టు జాతర లింగమంతుల స్వామిని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, దేవాదాయ అధికారులు స్వాగతం పలికారు. జాతరకు నాలుగో రోజు భక్తులు పోటెత్తారు.
పెద్దగట్టు జాతరలో అదే జోరు.. అదే హోరు
పెద్దగట్టు జాతర నాలుగో రోజు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. ఉదయం 11 గంటల నుంచి భక్తులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల నియంత్రణకు చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని సమయాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆర్టీసీ బస్సులను పెంచింది. రేపటితో ఈ జాతర ముగియనుంది.
ఇదీ చదవండి:రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్