తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదాడలో మద్యం దుకాణాల ఎదుట కోలాహలం - కోదాడ వార్తలు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మద్యం దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. దుకాణదారులు కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ అమ్మకాలు జరుపుతున్నారు. భౌతిక దూరం మరిచిన మందుబాబులు.. డజన్ల కొద్దీ మద్యం సీసాలను ఇంటికి తీసుకెళ్తున్నారు.

croud at liquor shops, Kodada
croud at liquor shops, Kodada

By

Published : May 11, 2021, 8:10 PM IST

ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించడంతో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఒక్కొక్కరు డజన్ల కొద్దీ మద్యం సీసాలను తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగా భావించిన దుకాణదారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు.

బెల్ట్ షాపులకు ఒక్కో సీసాను ముప్పై రూపాయల వరకు అదనపు ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. లాక్​డౌన్ కారణంగా మందుప్రియులకు దుకాణాల దగ్గర అవస్థలు తప్పడంలేదు. మహిళలూ లైన్​లో నిలబడి మద్యాన్ని తీసుకెళ్తున్నారు.

ఇదీ చూడండి:మద్యం దుకాణాలు ఉదయం 10లోపు తెరిచే అవకాశం లేదు: ఆబ్కారీశాఖ

ABOUT THE AUTHOR

...view details