తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్‌నగర్​లో తెరాసకు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ - హుజూర్​నగర్ ఉప ఎన్నికలు

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో తెరాసకు మద్దతు ఉపసంహరించుకున్నట్లు సీపీఐ ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

chada

By

Published : Oct 14, 2019, 10:16 PM IST

హుజూర్​నగర్ ఉప ఎన్నికలో తెరాసకు మద్దతు ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు మగ్దూం భవన్​లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగానే మద్దతు ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. గత పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా... 48వేల మంది కార్మికులను తొలగిస్తూ ప్రకటన చేయడం దుర్మార్గమని అన్నారు. నిరుద్యోగులను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుంటూ... ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగ యువకుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించినా పట్టించుకోకపోవడంతోనే... సీపీఐ ఈ నిర్ణయం తీసుకుందని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

హుజూర్‌నగర్​లో తెరాసకు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ

ABOUT THE AUTHOR

...view details