సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డీఈ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఈ శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ బిల్లులు వెంటనే మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు డిమాండ్ చేశారు.
విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని నిరసన - సూర్యాపేట జిల్లా వార్తలు
విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ హుజూర్‌నగర్‌లోని డీఈ కార్యాలయం ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వెంటనే మూడు నెలల బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని నిరసన
కరోనా సమయంలో 3 నెలల బిల్లులకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీయడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చిందని అన్నారు. ఈ 3 నెలల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మద్యం రవాణా... సరిహద్దులో ఉరుకులు పరుగులు